హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

BHNG: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. శుక్రవారం మోటకొండూరు మండల కేంద్రంలోని ఎంజేపీ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, వసతులు, విద్యాబోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.