హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

​నూతన సర్పంచులకు చీఫ్ విప్ జీవీ సన్మానం

PLD: వినుకొండ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నూతన కూటమి సర్పంచులను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సన్మానించి కేక్ కట్ చేశారు. 119 పంచాయతీలకు గాను 98 స్థానాలు గెలుచుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.