హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన

RR: బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పిలుపునిచ్చారు. తలకొండపల్లి ప్రభుత్వ, కస్తూర్బా పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడంతో పాటు ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. బాల్య వివాహాల నివారణకు అందరూ సహకరించాలని కోరారు.