హైదరాబాద్: 28°C
తెలంగాణ

29న జిల్లాలో తీన్మార్ మల్లన్న పర్యటన

WGL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అధినేత, MLC తీన్మార్ మల్లన్న ఈ నెల 29న ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా WGL పట్టణంలో నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం హనుమకొండలోని ప్రాంతీయ పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.