ADB: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు హైదరాబాద్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, గైనకాలజీ, నేత్ర, దంత వైద్య విభాగాలకు అవసరమైన వైద్య పరికరాలు మంజూరు, జన్నారం 30 పడకల ఆసుపత్రి సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన MLA వెడ్మ బొజ్జు


