MDK: భూముల రీ సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మనోహరాబాద్ తహసీల్దార్ ఆంజనేయులు సూచించారు. శుక్రవారం మండలంలోని దండుపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల సర్వే పనులను అయన పరిశీలించారు. రైతులు అందుబాటులో ఉండి తమ భూములను సర్వే చేయించుకోవాలని సూచించారు. భూ సర్వేతో రైతుల భూ హద్దుల ఏర్పాటుతో మేలు కలుగుతుంది అని అన్నారు.
తెలంగాణ
'భూ సర్వే ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'


