NZM: ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో Y.R.G. కేర్ లింక్ వర్కర్స్ స్కీమ్ ఆధ్వర్యంలో HIV బాధితులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా DRP సుధాకర్ మాట్లాడుతూ బాధితుల పట్ల వివక్ష చూపకూడదని, వారికి సరైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందించాలని సూచించారు. HIV చట్టం-2017 ప్రకారం వివక్ష చూపితే శిక్షార్హులవుతారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపొద్దు: డీఆర్పీ సుధాకర్


