RR: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ కలకలం రేపింది. దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి టికెట్‌ను ఎంట్రీ గేట్ వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేయగా, వివరాలు సరిపోలలేదు. దీంతో టికెట్ నకిలీదిగా గుర్తించి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ టికెట్ కలకలం


