హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు: సీపీ

MDCL: ఈ నెల 29న SI ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణకు సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడకుండా నిషేధం విధిస్తూ సీపీ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ ఆంక్షలు నవంబర్ 29న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి.