హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరిలో వైభవంగా కార్తీక పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో శుక్రవారం కార్తీక మాస పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, సహస్రనామార్చన, రామానుజాచార్యులకు పంచామృతాభిషేకం, దామోదర హవనం, సత్యనారాయణ వ్రతం, స్వామివారి కల్యాణం నిర్వహించారు. 3 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, తిరువీధి ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది.