ASF: జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని, పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీలకు సకాలంలో బియ్యం సరఫరా చేయాలని సూచించారు. రాయితీ బియ్యం పక్కదారి పట్టకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
తెలంగాణ
బియ్యం సరఫరాలో జాప్యం లేకుండా చూడాలి: కలెక్టర్


