హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభానికి నోచుకోని పల్లె దవాఖాన

NLG: మాడుగులపల్లి మండలం ఆగమోత్కూర్‌లో నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభానికి నోచుకోవడం లేదు. భవనానికి రంగులు వేసి సిద్ధం చేసినప్పటికీ విద్యుత్ పనులు, వైద్య పరికరాల ఏర్పాటు పూర్తికాలేదు. దీంతో అనారోగ్య సమస్యలకు సైతం గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మిగిలిన పనులు పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.