హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడి అనుమానాస్పద మృతి

వరంగల్ నగరంలోని విశ్వకర్మ వీధిలో విక్రమ్ అనే యువకుడు రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అర్ధరాత్రి గమనించిన అతడి స్నేహితుడు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు పుప్పాలగుట్టకు చెందిన ఆటో డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై గురువారం మట్టెవాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.