హైదరాబాద్: 28°C
తెలంగాణ

బటర్‌ఫ్లై లైట్లను ప్రారంభించిన మంత్రి

RR: నందిగామ మండల కేంద్రంలో రూ.5 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో కొత్తూరు వంతెన నుంచి షాద్‌నగర్‌లోని రెడ్‌రోజ్ గార్డెన్ వరకు ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై లైట్లను రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో మంజూరైన ఈ నిధులతో పాత జాతీయ రహదారి-44కు కొత్త శోభ వచ్చిందని సర్పంచ్ కొమ్ము కృష్ణ, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.