హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ పనులను పరిశీలించిన కలెక్టర్

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను కలెక్టర్, వీటీడీఏ వైస్‌ చైర్‌పర్సన్ గరిమ అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. తూర్పు రాజగోపురం, అనివేటి మండపం, కోనేరు, బద్ది పోచమ్మ ఆలయం, నిత్యాన్నదాన సత్రం పనుల పురోగతిని సమీక్షించారు. ప్రణాళికాబద్ధంగా పనులు వేగవంతం చేయాలని, అవసరమైన కార్మికులను పెంచాలని అధికారులను ఆదేశించారు.