హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

RR: చంపాపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఏడాది క్రితం రూ.17 లక్షలతో నిర్మించిన జీ+2 మరుగుదొడ్లకు కుండీలు, నీటి సౌకర్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్, డీఈవోతో మాట్లాడి వెంటనే అవసరమైన సౌకర్యాలు కల్పించి మరుగుదొడ్లను విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.