హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గతంలో భర్త.. ఇప్పుడు భార్య సర్పంచ్లు

ASR: అంతాడ పంచాయతీ సర్పంచ్‌గా వైసీపీ మద్దతుతో సుర్ల సలోమి విజయం సాధించారు. కూటమి అభ్యర్థి రేవతికి 364ఓట్లు రాగా, సలోమికి 576ఓట్లు వచ్చాయి. దీంతో 212ఓట్ల మెజార్టీతో సలోమి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆమె భర్త చంద్రరావు సర్పంచ్‌గా గెలిచి 2021నుంచి 2026వరకు సేవలందించారు. తాజాగా ఆయన భార్య సలోమి విజయం సాధించారు. గతంలో భర్త, ఇప్పుడు భార్య ఎన్నిక కావడం విశేషం.