హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 2 నుంచి 28 వరకు సదరం శిబిరాలు

SRCL: రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డిసెంబర్ 2 నుంచి 28 వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నారు. కంటి చూపు, వినికిడి, ఆర్థో, మానసిక, జనరల్ వైకల్యాల పరీక్షలు చేపట్టనున్నారు. దివ్యాంగులు ఆధార్, మెడికల్ రిపోర్టులు, ఎక్స్‌రే, యూడీఐడీ దరఖాస్తు, ఫొటోతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సూచించారు.