హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్టు షాపులు బంద్ చేస్తేనే నిధులు

కోటగిరి మండలం బస్వాపూర్‌లో MLA పోచారం శ్రీనివాస్‌రెడ్డి మహాలక్ష్మి ఆలయం, పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం, బీసీ హాల్‌ను ప్రారంభించారు. బెల్టు షాపులు తొలగించే గ్రామాలకే అభివృద్ధి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మద్యానికి బానిసై యువత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు.