VKB: యాలాల మండలం జుంటిపల్లి గ్రామంలో పాఠశాల వెనుక భాగం నుంచి మురుగు నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. రుద్రారం, నాగారం, పగిడిపల్లి గ్రామాల నుంచి నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. విద్యార్థులు, స్థానిక ప్రజలు మురుగు నీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుపైకి మురుగు నీరు.. ఇబ్బందులు


