హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

NRPT: విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని PDSU జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. శుక్రవారం నారాయణపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం కొరకు సిద్ధం చేసిన వంటకాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్య ఉందని, వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.