హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలతో అధిక ఆదాయం

SRPT: వేసవిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో రైతులు వేరుశనగ, మినుము, బొబ్బెర వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని నడిగూడెం ఏవో మలుసూర్ సూచించారు. శుక్రవారం కరివిరాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందాలని కోరారు.