హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోరు పంపుల వద్ద ఇంకుడు గుంతలు

VKB: దోమ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బోరు పంపుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేపడుతున్నారు. వృథాగా పోతున్న నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలమట్టాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నీటి వనరుల సంరక్షణతో భవిష్యత్తు తరాలకు మేలు జరగడంతో పాటు నీటి కొరత తగ్గే అవకాశం ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.