హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ

KMR: నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొని, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.