హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి కూలీల వేతనం రూ.500కు పెంచాలి: సీపీఐ

ADB: ఉపాధి హామీ కూలీల దినసరి వేతనాన్ని రూ.500కు, పనిదినాలను 200 రోజులకు పెంచాలని CPI రాష్ట్ర సమితి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తాంసి మండలంలోని కూలీల సమస్యలను పరిశీలించిన ఆయన, కనీస వసతులు కల్పించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. కూలీలకు న్యాయం జరగకపోతే ప్రజా పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, గణేష్ ఉన్నారు.