హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొడ్డవరపాడులో భారీ చోరీ

ప్రకాశం: మద్దిపాడు మండలం దొడ్డవరపాడు పంచాయతీ పరిధిలోని హైవే సిటీ వెంచర్‌లో భారీ చోరీ జరిగింది. నూకతోటి రాముకు చెందిన ఇంటి  తలుపులు పగలగొట్టి 3½ సవర్ల బంగారం, కేజీ వెండి వస్తువులు, రూ.1.20 లక్షల నగదును దొంగలు అపహరించారు. ఈ నెల 21న ఇంటికి తాళం వేసి వెళ్లిన ఇంటి యజమాని 27న తిరిగి వచ్చేసరికి చోరీ వెలుగులోకి వచ్చింది. ఒంగోలు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.