హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

SKLM: టెక్కలిలో అగ్నిప్రమాదాల నివారణపై పీహెచ్సీ సిబ్బందికి శుక్రవారం అవగాహన కల్పించారు. కే.కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి టెక్కలి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ప్రమాదాలకు కారణాలు, వెంటనే చేపట్టాల్సిన చర్యలు, మంటలను అదుపు చేసే పరికరాల వినియోగంపై ప్రత్యక్షంగా వివరించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు.