నారాయణపేటలోని పాత పీహెచ్‌సీ భవనాన్ని గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా తిరిగి వాడుకలోకి తీసుకురావాలని కోరుతూ బీజేపీ నాయకులు కలెక్టర్ ప్రియాంకకు వినతిపత్రం సమర్పించారు. భవనం నిరుపయోగంగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, దీనిని మరమ్మతులు చేసి ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్, కృష్ణయ్య గౌడ్, రణవీర్ పాల్గొన్నారు.
తెలంగాణ
పాత పీహెచ్‌సీ భవనంపై కలెక్టర్‌కు బీజేపీ వినతి


