NDL: ఆర్యవైశ్యులను తక్కువగా అంచనా వేయొద్దని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రంలో కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నేటి నాయకులు మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల సత్తాను రాజకీయ నాయకులు గుర్తించాలని, వారి అవసరం తీరాక పక్కన పెట్టొద్దని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆర్యవైశ్యులను తక్కువగా అంచనా వేయొద్దు'


