హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కూరగాయల పంటలతో రైతులకు లాభం'

MNCL: కూరగాయల సాగుతో రైతులకు లాభం వస్తుందని మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణ అన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని లింగాయపల్లిలో కూరగాయల సాగును సందర్శించి సూచనలు చేశారు. యాసంగి సీజన్లో ఆరుతడి పంటలను పండించాలని ఆయన కోరారు. వరి పంటకు దూరంగా ఉంటే మంచిదని ఆయన కోరారు.