హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటర్ల వివరాలు విడుదల

HYD: GHMC పరిధిలోని కాప్రా, నాచారం సర్కిళ్లలో పట్టభద్రుల ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ రెండు సర్కిళ్లలో కలిపి 11,812 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కాప్రాలో 5,713 మంది (పురుషులు 3,353, మహిళలు 2,360), నాచారంలో 6,099 మంది (పురుషులు 3,366, మహిళలు 2,733) నమోదయ్యారు. ఓటింగ్ కోసం కాప్రాలో 9, నాచారంలో 8 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.