CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విశ్రాంత ఉపాధ్యాయుడు, దాత చంద్రయ్య విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు పంపిణీ చేశారు. దాతల సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, చంద్రయ్య సేవలు అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకమరాజు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ సభ్యులు చంద్రయ్యను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారులకు అండగా విశ్రాంత ఉపాధ్యాయుడు


