హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

NTR: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండల ఖమ్మంపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆటో మరమ్మతులు చేస్తున్న ఇద్దరిని టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో ఒకరు గుణిచింతలపాడు, మరొకరు పోలిశెట్టిపాడు గ్రామాలకు చెందినవారు.