హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

TPT: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం ఎన్నికల సామగ్రి, ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అక్కడ నిల్వ చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. గోడౌన్ నిర్వహణ, సామగ్రి భద్రత, అక్కడ కల్పించిన రక్షణ ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.