హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం ఆలయంలో ఈవో ఆకస్మిక తనిఖీలు

KKD: అన్నవరం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీశివజ్యోతి ఆలయంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజులుగా వరుస తనిఖీలు నిర్వహిస్తూ పలు విభాగాలను పరిశీలిస్తున్నారు. శుక్రవారం తనిఖీల్లో కొన్ని పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. భక్తులనే భగవంతులుగా భావించి త్వరితగతిన దర్శనం కల్పించాలని ఆదేశించారు. అన్నదానంలోనూ నాణ్యత పెంచాలని సూచించారు.