హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సెమినార్

KMM: మహిళా డిగ్రీ కళాశాలలో ‘మారుతున్న సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, వేధింపులు, అసమానతలను వివరించారు. మహిళలు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో రాణించేందుకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు.