బాపట్ల రెడ్ క్రాస్ భవనంలో ఆయుష్ శాఖ, రెడ్ క్రాస్ సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ దాసరి చంద్రశేఖర్, డాక్టర్ ఐనాపురపు భువనేశ్వరి రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి శుక్రవారం శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ నారాయణ బట్టు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెడ్ క్రాస్ భవనంలో ఉచిత హోమియో వైద్య శిబిరం


