హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కురుమల సంక్షేమ కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్'

GDWL: కురుమ‌ల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయ‌కుడు కేసీఆర్ అని గద్వాల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి హనుమంతు నాయుడు అన్నారు. గట్టు మండలంలోని బల్గెర, ఆలూరు గ్రామాల్లో భక్త కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హనుమంతు పూలమాలవేసి, నివాళులర్పించారు. కురుమ కులస్థులు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో గొర్రెలను బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.