హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన హరీష్ రావు

సిద్దిపేటలో డిసెంబర్ 12న నిర్వహించనున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (టీఆర్ఆర్ఎస్) నాలుగో మహాసభ పోస్టర్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు శుక్రవారం కోకాపేటలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఆయనను మహాసభకు ఆహ్వానించారు. రజకుల ఐక్యత, హక్కుల సాధన, సంక్షేమం, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.