హైదరాబాద్: 28°C
తెలంగాణ

వింజపల్లిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

SDPT: కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో సర్పంచ్ అన్నాడి శ్రీజ–జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మోర విజయలక్ష్మికి రూ.11 వేలు, గర్రెపల్లి రాజేశ్వరికి రూ.16 వేల చెక్కులను అందజేశారు. పేద కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం సీఎంఆర్‌ఎఫ్ ఎంతో తోడ్పాటునందిస్తోందని పేర్కొన్నారు.