BHPL: గణపురం మండలం మైలారంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, 12 భవనాలకు గాను 9 భవనాల పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. పనుల్లో జాప్యం లేకుండా అవసరమైన సిబ్బంది సమకూర్చాలన్నారు.
తెలంగాణ
నాణ్యతతో పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్


