హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతుడి పూర్తి వివరాలు, మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.