ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ బి. దీపిక తెలిపారు. ఈ శిబిరంలో 177 మంది విద్యార్థులకు హిమోగ్లోబిన్, సీబీపీ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.
తెలంగాణ
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలి: డాక్టర్ దీపిక


