హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుపాయల ఆలయ హక్కులకు టెండర్ల ఆహ్వానం

MDK:​ పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లిలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానంలో తలనీలాలు, కొబ్బరి ముక్కల పోగు, ఎగ్జిబిషన్, పార్కింగ్ హక్కులకు సీల్డ్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 ఉదయం 10:30 వరకు షెడ్యూల్ పొంది, 3న మధ్యాహ్నం 12 లోపు టెండర్లు వేయాలి. మధ్యాహ్నం 12:30కు బహిరంగ వేలం ఉంటుందని పేర్కొన్నారు.