హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరల్డ్ మేయర్స్ ఫోరంలో కరీంనగర్ మేయర్ ప్రసంగం

KNR: ముంబై వేదికగా నిర్వహించిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం సదస్సులో కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొని నగర అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్ విజన్‌పై ప్రసంగించారు. 30 దేశాలకు చెందిన మేయర్లు, పట్టణాభివృద్ధి మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. అంతర్జాతీయ వేదికపై కరీంనగర్ అభివృద్ధి అంశాలను వివరించారు.