హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాయుధ దళాల పతాక దినోత్సవానికి సిద్దం

కర్నూలులో సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కార్ ఫ్లాగ్స్, స్టిక్కర్లను కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆవిష్కరించారు. సైనికులు, మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రజలు సహకరించాలని కోరారు. డిసెంబర్ 7న నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములై విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమాధికారి మహేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.