KDP: గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి గురువారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం 2.6 టీఎంసీల నీటిని తరలిస్తున్నట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రాత్రికి నీరు చేరుతుందని, ప్రస్తుతం గండికోటలో 15.862 టీఎంసీల నీటి నిల్వ ఉందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మైలవరం జలాశయానికి గండికోట నుంచి నీటి విడుదల


