హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే బర్త్‌డే.. ట్రాఫిక్ జామ్

MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను భారీగా నిర్వహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేడుకల కారణంగా నలువైపులా రహదారులపై వాహనాలు నిలిచిపోయి కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వేడుకలు నిర్వహించడం ఏమిటని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.