VZM: చీపురుపల్లి వ్యవసాయ శాఖ ఏడీ కోటేశ్వరరావు శుక్రవారం గరివిడి మండలం విపి రేగాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రేడ్ A ధాన్యానికి రూ. 2641, సాధారణ రకం ధాన్యానికి రూ. 2441 గిట్టుబాటు ధర కల్పిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బును జమ చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏడీ


