హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు సామాజిక తనిఖీ ప్రజావేదిక

JGL: జగిత్యాల రూరల్ మండలంలోని 29 పంచాయతీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వీబీజీ రాంజీ పనులపై 5వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను శనివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రమాదేవి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక జరుగుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని కోరారు.